హైదరాబాద్, వార్తానిధి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ పరిధిలోని సాయినగర్, NRI కాలనీ, రాజీవ్ గృహకల్ప సహా పలు కాలనీల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న భారీ ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం తాజాగా ‘కాకతీయ హిందూ సమ్మేళన ఉత్సవ సమితి’ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులుగా దొడ్డ పవన్, జనరల్ సెక్రటరీగా కొండ్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా సంతోషి దహగాం, చేగూరి రమేష్, వీర్రాజు, మదన్ మోహన్ గౌడ్ బాధ్యతలు చేపట్టగా, ట్రెజరర్లుగా ఎస్. శివకుమార్, శివకుమార్ గుప్త వ్యవహరిస్తారు. డాక్టర్ వెంకన్న, నవీన్ చందర్‌లు సమన్వయకర్తలుగా ఉంటూ ఈ భారీ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఏప్రిల్ 19న స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో జరగనున్న ఈ సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పారాయణ, గోపూజ వంటి విశేష ఘట్టాలు ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హిందూ ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
#HinduSammelanam #UtsavaCommittee