తపస్ రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం

రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: తపస్ రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం బియన్ రెడ్డి నగర్ సాహితీ డిగ్రీ కళాశాలలో జరిగింది. జిల్లా అధ్యక్షులు యస్.జనార్ధన్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు, ఏబిఆర్ఎస్ఎం ప్రాథమిక వింగ్ సహాయకులు డాక్టర్ సూరం విఘ్ణవర్దన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనం పద్మ, రాష్ట్ర కార్యదర్శి కాయల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. 

జిల్లాలో తపస్ సంఘ పటిష్టత కొరకు చేపట్టాల్సిన అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పలు అంశాలను తీర్మానించారు.

1.ఎన్నో సంవత్సరాలుగా నిలిచి పోయిన ఉపాధ్యాయ పదోన్నతులలో 10వేల పిఎస్ఎంహెచ్ పోస్టులతో, పండిత్, పీఈటీ పోస్టులను, వాటితో పాటు అన్ని సబ్జెక్ట్ లలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం తీర్మానించింది.

2.సీపీఎస్ వెంటనే రద్దుచేసి పాత పెన్షన్(ఓపీఎస్)విధానం ప్రవేశ పెట్టాలి.

3.సమగ్రా శిక్ష పథకం (ఎస్ఎస్ఏ) లో మండలాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు విధానంలో, ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న కెజిబివి, యుఆర్ఎస్ ఉద్యోగులను, సీఆర్పి, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను వెంటనే క్రమబద్దీకరిoచాలి.

4.317 జీఓలో బాధితులకు న్యాయం చేస్తూ ఎవరి స్వంత జిల్లాలకు వాళ్ళను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.      

5.ప్రతి నూతన జిల్లాలో జీపీఎఫ్, టిఎస్ జిఎల్ఐ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.

6.ప్రతి నూతన జిల్లాలో ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి వాటి అమలు కొరకు జిల్లా శాఖ ప్రాతినిధ్యం వహించాలని జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ రావు, కొంగర శ్రీనివాసులు, జిల్లా గౌరవ అధ్యక్షుడు జిహెచ్ఎం లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post