సమ్మక్క సారలమ్మ ముమ్మాటికి మన దేవతలే : స్వామి పరిపూర్ణానంద


తెలంగాణ, వార్తానిధి: ఇటీవల సమ్మక్క సారలమ్మ దేవతల విషయంలో చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో.. ముఖ్యంగా గిరిజన ప్రజల్లో అయోమయాన్ని కలిగించాయని శ్రీ పీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద అన్నారు.

దానికి స్వస్తి పలుకుతూ.. సమ్మక్క సారలమ్మ ముమ్మాటికి మన దేవతలే అని స్వామీజి తెలియజేశారు. అభ్యంతరకర వ్యాఖ్యల వలన ఏ హిందువు బాధపడినా, దానికి తాను క్షమాపణ వేడుకుంటున్నానని అననారు. మన దేవతలను - మన సంస్కృతిని మనమే గౌరవించుకోవాలి అని పిలుపునిచ్చారు.

Post a Comment

Previous Post Next Post