బ్రాహ్మణులకు విధాత మాట్రిమోని సేవలు..



నిజామాబాద్, వార్తానిధి: విధాత బ్రాహ్మణ మాట్రిమోని ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువతీయువకులకు వివాహ సంబంధాలను చూస్తున్నామని మాట్రిమోని నిర్వాహకులు సంతోష్ నల్లవెల్లి తెలిపారు.

నవంబరు 30, 2020లో తన తండ్రి నల్లవెల్లి రామారావు ఆశీర్వాదంతో మాట్రిమోని ప్రారంభించామని అన్నారు. ఫిబ్రవరి 2022 నాటికి 48 బ్రాహ్మణ పెండ్లి సంబంధాలు కుదిర్చామని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బ్రాహ్మణ అమ్మాయి, అబ్బాయిలకు సంబంధాలు చూస్తున్నామని తెలియజేశారు. 

హరి వాయు గురుల ఆశీర్వాదంతో విదేశీ సబంధాలు కూడా చూపించే అవకాశం వచ్చిందని చెప్పారు. మరింత మంది బ్రాహ్మణ అమ్మాయిలు, అబ్బాయిలకు వివాహ సంబంధాలు కుదిర్చేందుకు ముందుకు సాగుతున్నానని అన్నారు.

వివాహ సంబంధాలు చూస్తున్న బ్రాహ్మణులు తనను 90007 77373 నెంబరులో వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

లేదంటే ప్రతి ఆదివారం నిజామాబాద్లోని(ఇందూర్) వినాయకనగర్, మహాలక్ష్మీనగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో విధాత బ్రాహ్మిణ్ మాట్రిమోని వద్ద తనను సంప్రదించవచ్చని తెలిపారు.

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

అవివాహిత బ్రాహ్మణ యువతి, యువకులకు నామ మాత్ర రుసుముతో సేవలను అందిస్తున్నామని సంతోష్ నల్లవెల్లి అన్నారు. మరిన్ని వివరాలకు 90007 77373, 89194 49094 సంప్రదించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post