పోలీస్ అధికారులకు హైకోర్టు నోటీసులు : వెంకట్ బల్మూరి

 


హైదరాబాద్, వార్తానిధి: తనను అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు.  పిటిషన్ ను శుక్రవారం విచారించిన కోర్టు హైదరాబాద్ సీవీ ఆనంద్ తో పాటు సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్, ఇన్స్ పెక్టరుకు నోటీసులు జారీ చేసిందని అన్నారు. మార్చి 10వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించినట్ు పేర్కొన్నారు. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేసిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తన్నామని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని స్పష్టం చేశారు.

#NSUI #VenkatBalmoori #Police #Telangana

Post a Comment

Previous Post Next Post