వక్ఫ్ బాధితుల గొంతు వినిపించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు : కొంపల్లి మోహన్ రెడ్డి

 

-బోడుప్పల్ మున్సిపాలిటీలో వక్ఫ్ బోర్డు బాధితులు

-1989 గెజిట్ పేరిట ఓ వ్యక్తి ఫిర్యాదు

-బాధితులుగా మారిన సుమారు 6వేల కుటుంబాల వారు

-30 ఏళ్లపైనే నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలి

-పరిష్కారం కోసం బిజెపి పని చేస్తుంది

మేడ్చల్ జిల్లా, వార్తానిధి: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న వక్ఫ్ బాధితుల గొంతును అసెంబ్లీలో వినిపించారని బిజెపి రాష్ట్ర నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయమై మోహన్ రెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితుల సంఘం తరపున భూ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరామన్నారు. దానిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో బాధితుల గొంతు వినిపించారని తెలిపారు. 1989 నుంచి ఇప్పటి వరకు బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో సుమారు 34 లేఅవుట్లు ఏర్పాటయ్యాయని, అందరూ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇండ్లను నిర్మించుకున్నారని రఘునందన్ రావు అసెంబ్లీ స్పీకర్ కు తెలియజేశారన్నారు. 13 నవంబర్ 2018 నుంచి ఆయా భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులను నిలిపివేశారని పేర్కొన్నారన్నారు. 2020 నుంచి అక్కడ నిర్మించే ఇండ్లను ఇంటి నెంబర్ ఇవ్వడం ఆపేశారన్నారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి నూతన ఇండ్లకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. 

ఈ విషయానికి సమాధానం దొరకక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా సంబంధిత భూములు 1989 గెజిట్ ప్రకారం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములని ఫిర్యాదు చేసినట్లు స్పీకర్ కు వివరించారన్నారు. కానీ వాదనను బలపరిచేలా ఎటువంటి డాక్యుమెంట్లను ఇవ్వలేదని చెప్పారన్నారు. అయితే ఇప్పటికే ఆరు వేల కుటుంబాలు ఇండ్లు కట్టుకొని ఉన్నాయన్నారని తెలిపారు. 1989 నుంచి లేఅవుట్లు అయ్యాయి, రిజిస్ట్రేషన్లు అయ్యాయి, మున్సిపల్ పర్మిషన్ వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికి ఇంటి నెంబరు ఇవ్వకపోవడం, అనుమతులు ఇవ్వకపోవడం, కొత్తగా రుణాలు రాకుండా చేయడం, డాక్యుమెంట్లను ఆపించే ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలియజేశారన్నారు. బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలవాసులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తిరిగి సర్వే చేయాలని కోరారన్నారు. 

వక్ఫ్ కు సంబంధించిన ఆస్తులైతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తే కాలనీవాసులకు ఇబ్బంది లేదన్నారన్నారు. అయితే అడ్వర్స్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సర్వేలు చేసి కాలనీల ప్రజలకు న్యాయం చేయాలని స్పీకరును కోరారని కొంపల్లి మోహన్ రెడ్డి వెల్లడించారు. మాట నిలబెట్టుకున్నందుకు గానూ ఆయనకు ధన్యవాదాలను తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవన్మరణ సమస్యగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా మున్ముందు బిజెపి పనిచేస్తుందని అన్నారు.

#Medchal #Boduppal #WAQF #BJPTelangana

Post a Comment

Previous Post Next Post