మల్కాజిగిరి, వార్తానిధి: మల్కాజిగిరి డివిజన్ పరిధిలో చేపట్టిన డెవలప్మెంట్ పనుల్లో నాణ్యతను పాటించాలని స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ ఊరపల్లి అన్నారు. డివిజనులోని విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో ఆయన సోమవారం పర్యటించారు. రూ.52లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం పోరాడుతున్నానని తెలిపారు. అందుకు ప్రజల నుంచి కూడా తగిన మద్ధతు లభిస్తోందన్నారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నెరవేర్చడంలో సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
#GHMC #CorporatorSravan #Malkajgiri #BJPTelangana
Tags:
స్థానికం