ఏపీ, వార్తానిధి: శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ముఖ్య ఆహ్వానితులుగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని, పట్టుదలతో చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇంటర్మీడియట్ దశ జీవితానికి బలమైన పునాది వంటిదని, ప్రతి విద్యార్థిని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. గత విద్యా సంవత్సరంలో 97 శాతం ఉత్తీర్ణత సాధించిన ఈ కళాశాల, ఈసారి 100 శాతం ఫలితాలతో మరింత మెరుగ్గా రాణించాలని కోరారు.
ఇదే సందర్భంలో డే స్కాలర్ విద్యార్థినుల కోసం ప్రభుత్వం తరహాలో టీటీడీ ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కళాశాలలోని 436 మంది విద్యార్థినులకు పోషకాహారంతో కూడిన భోజనం అందనుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, శాంతారామ్, నరేష్ కుమార్, డీఈవో డాక్టర్ వేంకట సునీలు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. భువనేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
Tags:
ఆంధ్రప్రదేశ్