ఏపీ, వార్తానిధి : రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తీరును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద మంత్రులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంలో పనులను గాడిన పెట్టి వేగవంతం చేసిన కారణంగా ఇప్పటి వరకు ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని సీఎం అన్నారు. మిగిలిన పనులతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
2027 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చి.. రైతన్నల సాగునీటి కష్టాలు తీరుస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పరస్పర సహకారంతో పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మారుస్తామని స్పష్టం చేశారు.
Tags:
ఆంధ్రప్రదేశ్