ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విద్యారణ్యం వేదపాఠశాల వ్యవస్థాపకులు మాడుగుల శశిభూషణ సోమయాజి గురూజీ, సేవాభారతి తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి వాసు, డాక్టర్ భువనేశ్వరీ మారేపల్లి హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా గోపూజ, భరతమాత పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేశభక్తి గీతాల ఆలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ముఖ్య వక్తలు ధార్మిక అంశాలపై, సమాజ ఐక్యత ఆవశ్యకతపై సందేశాలను అందించనున్నారు.
సమాజంలోని హిందువులందరినీ ఏకం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీజైన్, ఉప్పాల వంశీగుప్తా, స్వాగత కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం సాయంత్రం జరగనున్న ఈ ధార్మిక వేడుకకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి, నీతా, సంతోష్, సాత్విక్ తదితరులున్నారు.