భారత్-పాకిస్థాన్ దేశాలకు మధ్య ఇప్పుడేదైనా చర్చ జరిగితే అది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించేనని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అది తప్ప ఇంకేం మాట్లాడినా మాటల్లేవ్, మాట్లాడుకోడాల్లేవ్ అని తేల్చి చెప్పేసింది. పీఓకే విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరును తిరిగి ఇవ్వాల్సిందేనన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పంద పునరుద్ధరణ జరగదని కుండబద్ధలు కొట్టారు.
#pok #Indopak #induswatertreaty #SJaishankar
Tags:
జాతీయ వార్తలు