కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న దేశ రాజధాని దిల్లీని దుమ్ము చుట్టు ముట్టేసింది. దీంతో స్పష్టంగా దారులు కనిపించడం లేదు. రాజస్థాన్ వైపు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో ధూళి, దుమ్ము చేరి దిల్లీతో పాటు పంజాబ్, హర్యాణ, ఉత్తర రాజస్థాన్ లను చుట్టేసినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే దీనిపై కూడా దిల్లీలోని ఆప్, బిజెపి పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకోవడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
#delhi #pollution #sand
Tags:
జాతీయ వార్తలు