దేశభక్తి ఉన్న భారతీయులు టర్కీకి వెళ్లడం మానుకోవాలని నెటిజన్లు కోడై కూస్తున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసిన ఆ దేశానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే తప్ప వెళ్లకూడదు అంటున్నారు. ఆ మందుగుండు సామాగ్రిని పాకిస్థానీ సైనికులు భారతీయ పౌరులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని గుర్తుంచుకోమంటున్నారు.
టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం ఆపరేషన్ దోస్త్‌ను నిర్వహించి మన దేశం టర్కీ ప్రజల ప్రాణాలను కాపాడటానికి సైనికులను పంపిందని గుర్తు చేస్తున్నారు. భారతీయ దళాలు అత్యంత క్లిష్ట సమయంలో సహాయం చేయడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టాయని స్పష్టం చేస్తున్నారు. ప్రతిగా, టర్కీ ఒక ఉగ్రవాద రాజ్యాన్ని సమర్థించిందని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. పాక్దా ఏకైక లక్ష్యం భారతదేశాన్ని నాశనం చేయడమని, మన దేశ భద్రతను విస్మరించే టర్కీ లాంటి దేశాలకు లాభం కలిగించే విధంగా వ్యవహరించొద్దని సాటి భారతీయులను కోరుతున్నారు.
#boycott #turkey #indopak #news