సినిమాల్లో గూఢచారులను చూడడమే కానీ నిజ జీవితంలో సాధారణ ప్రజలకు అటువంటి వారు కనిపించడం కష్టమే. జన జీవన స్రవంతిలో కలిసిపోయి తమ పనులను గుట్టు చప్పుడు కాకుండా చక్కబెట్టుకుంటూ ఉంటారు. అదే శత్రు దేశానికి చెందిన గూఢచారి అయితే ఇంకేమైనా ఉందా? అది ఏకంగా ఆర్మీ కంటోన్మెంటులోనే టైలరుగా పనిచేస్తే? వినడానికే భయంగా ఉంది కదా. కాకపోతే పంజాబ్ లోని భటిండాలో జరిగిందట. భటిండా కంటోన్మెంటులో టైలరుగా పని చేస్తూ ఇక్కడి రహస్యాలు పాక్ ఐఎస్ఐ కు చేరవేస్తున్న గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారట. అతని పేరు రకీబ్ అని మీడియా కథనాలు.
#punjab #ISI #police #news
Tags:
జాతీయ వార్తలు