న్యూదిల్లీ, వార్తానిధి: ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో 'చక్రవ్యూహ ప్రసంగం' చేయడంతో ప్రధాని మోదీ ప్రభుత్వం తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడికి ప్లాన్ చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ శుక్రవారం తన ఎక్స్ అకౌంట్లో ఆరోపించారు. ఈడీలో ఉన్న కొందరు రైడ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తనకు తెలియజేశారని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కోసం తాను వేచి చూస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చెప్పారు. అయితే రాహుల్ ఆరోపణల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రైడ్లు చాలా విశ్వసనీయంగా జరుగుతాయి. అటువంటి సున్నితమైన సమాచారం బహిర్గతం కావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
#rahulgandhi #congress #breakingnews
Tags:
జాతీయ వార్తలు