ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు రైల్వే ప్రమాదాలు 0.24 నుంచి 0.19కి తగ్గాయని చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న వారు చప్పట్లు కొట్టేవారన్నారు. అదే సభ్యులు 0.19 నుంచి 0.03 శాతానికి ప్రమాదాల సంఖ్య తగ్గినప్పుడు మాత్రం నిందలు మోపు చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఇలాగే ముందుకు సాగుతుందా అని ప్రశ్నించారు? కాంగ్రెస్ తమ సోషల్ మీడియా సైన్యంతో తప్పుడు ప్రచారాలను చేస్తోందని విమర్శించారు. రైల్వే ద్వారా ప్రయాణించే 2 కోట్ల మందిని వారు భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారా అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.
#aswinivaishnav #indianrailways #varthanidhi #news #loksabha
పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోను చూడగలరు.
Tags:
జాతీయ వార్తలు