హైదరాబాద్, వార్తానిధి: బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం లాంఛనప్రాయం అని నెహ్రూ యువకేంద్ర సంఘటన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, బీజేవైఎం మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి జీడిమడ్ల హరిప్రసాద్ అన్నారు. ఈటెల రాజేందర్ కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతెహ్ నగర్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ శనివారం ప్రాంతంలో పర్యటించారు. ఆయనతో పాటు హరిప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానికులు పలు అంశాలను రాజేందర్ దృష్టికి తీసుకురాగా.. ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేరుస్తానని హామీనిచ్చారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ మల్కాజ్ గిరిలో ఎగరబోయేది బీజేపీ జెండా అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న రాజేందర్ విజయం నల్లేరు మీద నడక అని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వ బలోపేతం కోసం మల్కాజ్ గిరి పార్లమెంట్ పై విజయకేతనం ఎగురవేసి కానుకగా అందిస్తామన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ నినాదం అని వెల్లడించారు