హైదరాబాద్, వార్తానిధి: బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా మతపరమైన నిర్మాణాలు ఉండొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెన్నైలోని కోయంబేడులోని ప్రసిద్ధ మసీదు కూల్చివేతను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్రమంగా నిర్మించిన కట్టడంలో మతపరమైన కార్యకలాపాలు చేయడం సరికాదని పేర్కొంది. మసీదును వేరే చోటికి తరలించాలని సూచించింది. మతం పేరుతో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మతం పేరిట అక్రమ కట్టడాలు ఉండకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది.
#supremecourt #chennai
Tags:
జాతీయ వార్తలు