హైదరాబాద్, వార్తానిధి: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. 2024 - 25 విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టం -2020లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది.
#NEP2020 #Education
Tags:
తెలంగాణ