రూ.500లకే సిలిండర్ పథకంలో సర్కారు మెలిక!

 


హైదరాబాద్, వార్తానిధి: తెలంగాణ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకంలో చిన్న మెలిక పెట్టింది. వినియోగదారులు గ్యాస్ బండ డెలివరీ తీసుకునేటప్పుడు పూర్తి ధర చెల్లించాలని కోరింది. అయితే సబ్సిడీ కింద చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చమురు మార్కెటింగ్ కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన బదిలీ చేయనుంది. సదరు కంపెనీలు నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజాపాలన ద్వారా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు, తెలంగాణ రేషన్ కార్డు కలిగిన వారు, డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారు పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది.

#LPG #Telangana #500

Post a Comment

Previous Post Next Post