హైదరాబాద్, వార్తానిధి: ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం వల్ల నరకం చూస్తున్నామని ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమ్మక్క - సారక్క జాతర నేపథ్యంలో నగరంలోని బస్సులను జాతర వైపు ప్రయాణికుల కోసం మళ్లించారని, దీంతో నగరంలోని ప్రయాణీకులకు సరిపడ బస్సులు లేవన్నారు. అయితే ప్రయాణీకులు తమ మాట వినకుండా ఫుట్ బోర్డుపై కూడా ప్రయాణం చేస్తున్నారన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే అందుకు తమనే బాధ్యులు చేస్తారని వాపోయారు. తమ గోడును వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
#tsrtc #drivers #sammakka #sarakka #Hyderabad
Tags:
తెలంగాణ