న్యూఢిల్లీ, వార్తానిధి: భౌగోళిక, రాజకీయాలు, ఆర్థిక విషయాలపై జరుగుతున్న రైసినా డైలాగ్ సదస్సు న్యూఢిల్లీలో జరుగుతోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, రైల్వేలు, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేబ్రాయ్ తదితరులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
బుధవారం ప్రారంభమైన ఈ సదస్సు నేడు, రేపు కొనసాగనుంది. ఈ సదస్సులో మంత్రులు, మాజీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, మిలిటరీ కమాండర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, మేధావులతో సహా 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.
#raisina #newdelhi #jaishankar #summit #Newindia
Tags:
జాతీయ వార్తలు