కర్ణాటక, వార్తానిధి: అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్నాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కోటి రూపాయలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుంది. అదే సమయంలో 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
#karnataka #congress #temples #tax #BJP
Tags:
జాతీయ వార్తలు