మేడ్చల్ జిల్లా, వార్తానిధి: మేడ్చల్ జిల్లా నెహ్రూ యువకేంద్ర సంఘటన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా తనను నామినేట్ చేసిన బిజెపి పెద్దలకు బిజెవైఎం మేడ్చల్ అర్బన్ జిల్లా అధికారి ప్రతినిధి జీడిమడ్ల హరిప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ నియామక పత్రాన్ని మేడ్చల్ జిల్లా యువజన అధికారి ఇసయ్య చేతుల మీదుగా అందుకున్నామన్నారు. ఎమినెంట్ పర్సనాలిటీ విబాగం కింద తన పేరును నామినేట్ చేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డికి, కేంద్ర యువ మరియు క్రీడా మంత్రిత్వ శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హరిప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
#BJYM #BJP #Medchal #NYKS #HariPrasadJ #NehruYuvaKendra