ఉపాధ్యాయ బదిలీల్లో ధ్రువపత్రాల రీవెరిఫికేషన్ చేయాలి : తపస్

 


రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: 2023 ఉపాధ్యాయ బదిలీల్లో అవకతకవలను నివారించేందుకు ధ్రువపత్రాల రివెరిఫికేషన్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. ఈ మేరకు సంఘం నాయకులు పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భూపాల్ రెడ్డికి అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తపస్ రాష్ట్ర ప్రశిక్షణ సహ ప్రముఖ్ బొడ్డు రవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాశీరావు ఉన్నారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ బదిలీ కోసం సమర్పించిప వైద్య ధ్రువపత్రాలను పున:పరిశీలన చేయాలన్నారు. నకిలీ పత్రాలను గుర్తించి వాటిని సంబంధించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని కోరారు. స్పౌజ్ బదిలీల్లో నిర్ణీత కాల పరిమితి నిండకుండానే దరఖాస్తు చేసుకున్న వాటిని జాబితా నుంచి తొలగించాలన్నారు. ఉపాధ్యాయుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని కోరారు. కేటగిరి 1లో పనిచేసి కేటగిరి 3గా పనిచేస్తున్నట్లుగా నమోదు చేసుకొని అదనపు పాయింట్స్ పొందిన వారి వివరాలను పరిశీలించి సరిచేయాలని విన్నవించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post