ప్రత్యేక పాయింట్స్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి : తపస్

 


రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: ప్రమోషన్లు, బదిలీల కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక పాయింట్స్ రద్దు చేసి ఇతర ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు వినతి పత్రాన్ని సమర్పించింది.

సంఘం రాష్ట్ర ప్రశిక్షణ ప్రముఖ్ బొడ్డు రవి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ మాట్లాడుతూ 2023 పదోన్నతులు, బదిలీల్లో చాలా మంది ఉపాధ్యాయులు ప్రత్యేక కేటగిరి కింద లబ్ధి పొందేందుకు తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించారని ఆరోపించారు. వారి వలన అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్రువ పత్రాల రివెరిఫికేషన్ చేసి అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. 

#TPUS #TeachersTransfers #Telangana #KCR

Post a Comment

Previous Post Next Post