- .డీజీపీని కలిసిన VHP రాష్ట్ర బృందం
- యువతను జాగృతం చేసేందుకు బజరంగ్ దళ్ ర్యాలీలు
- ఈనెల 30 నుంచి వచ్చే నెల 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు
హైదరాబాద్, వార్తానిధి: విశ్వహిందూ పరిషత్ (VHP) స్థాపించి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా VHP షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పరిషత్ ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి తెలిపారు. అందులో భాగంగా యువతను జాగృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో "శౌర్య జాగరణ యాత్ర" నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 14 వ తారీకు వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో యాత్రలు చేపట్టడానికి నిర్ణయించామన్నారు.
దేశం కోసం ధర్మం కోసం యువతను జాగృతం చేయడం.. స్వాతంత్ర సమరయోధుల బలిదానాలను నేటి యువతకు తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువతలో దేశభక్తి ,జాతీయభావాలు నింపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ యాత్రలకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జాతీయ నాయకులు హాజరవుతున్నారని ప్రకటించారు. యాత్రలకు అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు వినతి పత్రం సమర్పించామని వెల్లడించారు. ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ ఆయా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్ లతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారన్నారు.
డీజీపీని కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఉన్నారు.
#VHP #Bajrangdal #ShouryaJagaranaYatra #Telangana