తపస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా

 


రంగారెడ్డి, వార్తానిధి: అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

ఉపాధ్యాయులకు మద్ధతుగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేయాలన్నారు. జీఓ 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను వెంటనే స్థానిక జిల్లాల్లో నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంత రావు మాట్లాడుతూ పోరాటాలు, ఉద్యమాల ద్వారా విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా చేస్తూ వాటి పరిష్కారంలో తపస్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై ఈ నెల 19న రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ధర్నాకు మద్ధతుగా హాజరైన బిజెపి రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ తపస్ కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని తెలిపారు.

తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోట్ల కాశీరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారంలో తపస్ కార్యకర్తల నిరంతర పోరాటం సాగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ, ఏబీఆర్ఎస్ఎం నాయకులు డాక్టర్ సూరం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్.జనార్ధన్ రెడ్డి, బొడ్డు రవి, కాయల శ్రీనివాస్ రెడ్డి, విద్యావతి, శ్రీహరికృష్ణ, సురధీర్, జిల్లా కోశాధికారి దూత కృష్ణ, మహిళా కన్వీనర్ సుమరంజిత, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహా రెడ్డి, కృష్ణ , చంద్రశేఖర్, జిల్లా నాయకులు చెర్క రాందాస్, మహిపాల్ రెడ్డి, శంకర్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post