శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్త సొమ్ము అల్లుని దానం అన్న చెందంగా తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచడం ఏంటని?
ఆంధ్రులతో పోరాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కనపెట్టి దేశ రాజకీయాల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏముందని ఎద్దేవా చేశారు.
రైతులకు ఉచిత ఎరువులు , నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్ లు, ఉద్యోగ నియామకాలు వీటిపై దృష్టి సారించలేని సీఎం కెసిఆర్ దేశ రాజకీయాలను ఎల మలుపు తిప్పగలరో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో బాధితులైన డబ్బు తిప్పాయపల్లె, రామ్ సాగర్ హిమ్మత్ రావు పేట తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికీ సీఎం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని గుర్తు చేశారు.
మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కి తీసుకువెళ్లిన టిఆర్ఎస్ పార్టీ దేశ ఆర్థిక పరిస్థితులు గురించి మాట్లాడటం ఎంతవరకు సబబని అన్నారు.
ఇకనైనా ప్రతి ఒక్క పౌరుడు ఉద్యమించి వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని కోరారు.
ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పాటుపడుతూ రాగద్వేషాలు లేకుండా ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం, పట్టణ అధ్యక్షుడు జనగామ రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి నీలం రవి, కరబూజ చక్రం గౌడ్, ఐటీ సెల్ మండల అధ్యక్షుడు యాగండ్ల సాయితేజ, గాండ్ల శ్రీనివాస్ తోట సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.