మల్యాల, వార్తానిధి: కొండగట్టుకు అంజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మల్యాల మండల బిజెపి డిమాండ్ చేసింది.
ఈ మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో దేవాలయం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిరసనను వ్యక్తం చేశారు.
కొత్తగా నిర్మించిన కోనేరులో నీటిని నింపాలన్నారు. వేసవి కాలం కాబట్టి భక్తులకు చలువ పందిళ్లను నిర్మించాలన్నారు.
భక్తులకు స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పించాలని, దేవస్థానం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
కొండపై అధిక ధరలను నియంత్రించాలని కోరారు. బిజెపి డిమాండ్లను తెలుసుకున్న ఆలయ ఈఓ త్వరలోనే సౌకర్యాలను కల్పిస్తామని హమీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, నాయకులు రమేష్, వెంకటస్వామి, రాములు, సురేష్, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.