సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి : జంగపల్లి ఐలయ్య

అక్కన్నపేట, వార్తానిధి:  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆరోపించారు.

హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ ఛార్జిలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఐలయ్య మాట్లాడుతూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు ధరలు పెంచిందన్నారు. మరోవైపు తామేమి తక్కువ అన్నట్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిదంగా యాసంగి వరి ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వంటే నువ్వని దొబూచులాడకుండా రైతులు పండించిన వరిధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రములో కట్కూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈసంపెల్లి శ్రీకాంత్, గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, అక్కన్నపేట పార్టీ టౌన్ అధ్యక్షుడు పిరెళ్ల లింగమూర్తి..

బబ్బూరి యాదగిరి,ఎండీ ఫరిద్, మాజీ యంపిటిసి మ్యాక రమేష్, కొలిపాక సంపత్, చౌటపల్లి ఉపసర్పంచ్ పోశెట్టి, బంధారం శ్రీనివాస్, యూత్ నాయకులు చొక్కం గణేష్, పండ్రాల దామోదర్ నకీర్తి మునిరాజ్, గుగులోతు రాజు, ఆంజనేయులు..

లింగంపల్లి సారయ్య, దేవునూరి రాజు, త్రిమూర్తి, ఎండీ ఫరుక్, ఏలేటి తిరుపతి రెడ్డి, సున్నపు అజయ్ కుమార్, యాటపోలు సుమన్, పోతరబోయిన రాజు, యాటపోలు సంతోష్, నాయకులు  భూక్యా లాలు, కరోంటోతూ రవి, భూక్యా చందర్, బండి శ్రీను, బదనాపురం రాజు, జంగపల్లి మల్లేష్, గుగులోతు శ్రీను, గోల్కొండ రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post