బంగారు తెలంగాణ అంటే ధరలు పెంచడమా : భార్గవి కళ్యాణి

 


హైదరాబాద్, వార్తానిధి: సీఎం కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ధరలను పెంచడమా అని బిజెవైఎం మేడ్చల్-మల్కాజిగిరి రూరల్ జిల్లా అధికార ప్రతినిధి భార్గవి కళ్యాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బిజెపి ఆధ్వర్యంలో బషీర్ బాగ్ వద్ద నిర్వహించిన ఒపీనియర్ బ్యాలెట్ కార్యక్రమాన్ని ఆమె హాజరయ్యారు. విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భార్గవి కళ్యాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదన్నారు. దీంతో బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పది రూపాయలు ఎక్కువకే వాటిని విక్రయిస్తున్నారని తెలిపారు.

ఒకవైపు పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నులను తగ్గించకుండా.. మరోవైపు విద్యుత్ చార్జీలను, బస్సు చార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే విద్యుత్, బస్సు చార్జీలను తగ్గించాలన్నారు. లేదంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post