ఒకవైపు విద్యుత్ చార్జీల మోత.. మరోవైపు కరెంట్ కోత : జంగపల్లి ఐలయ్య

 

అక్కన్నపేట, వార్తానిధి: టీఆర్ఎస్ సర్కార్‎పై అక్కన్నపేట మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో పాటు విద్యుత్ సరఫరాలో కూడా కోతలు విధిస్తూ రైతుల పొట్టకొడుతుందని మండిపడ్డారు. 

ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకుందన్నారు. రైతులకు ఇప్పుడు కేవలం 11 గంటల కరెంట్ మాత్రమే ఎందుకు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్‎ని తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇచ్చేది 11 గంటలు.. పేరుకు 24 గంటల విద్యుత్..

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చేది 24 గంటలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మాత్రమే ఇస్తుండటంతో రైతులు వేసిన పంటలు పండటం కష్టంగా మారిందని ఐలయ్య పేర్కొన్నారు. 

రైతు వేసిన నాలుగు ఎకరాల్లో కనీసం పంటకూడా దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రకాల పంటలు వేసిన రైతు ఏదో ఒక పంటను వదులుకొవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరో పంట పెట్టుబడి నష్టపోతున్నట్లు తెలిపారు.

రైతుల కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కి డ్రామాలు చేయడం కాదు.. పొట్టకు వచ్చిన పంటను సరైన సమయంలో నీరు అందేటట్లు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 అవసరం ఉండే సమయంలో ఇవ్వని విద్యుత్ అవసరం లేని సమయంలో ఇవ్వడం రైతును నట్టేట ముచ్చడమేనని టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. రైతాంగం రోడ్డెక్కే పరిస్థితి తీసుకురాకుండా అవసరమైన విద్యుత్ అందించాలన్నారు.

యావత్తు రాష్ట్ర రైతుల తరుపున హెచ్చరిస్తున్నామని ఐలయ్య తెలిపారు. లేదంటే భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా రైతులతో కలిసి విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఐలయ్య హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post