తెలంగాణ సాధూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు

 


రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: తెలంగాణ సాధూ పరిషత్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు అయ్యింది. తుర్కయంజాల్ లోని శ్రీరామచంద్రస్వామి దేవాలయ ఆవరణలోని జయరాం గురుస్వామిజీ ఆశ్రమంలో కమిటీ ఏర్పాటు సమావేశం బుధవారం నిర్వహించారు.

రాష్ట్ర అధ్యక్షులుగా శంకర్ స్వామిజీ.. ఉపాధ్యక్షులుగా కైవల్యదాసు స్వామిజీ.. కోశాధికారిగా జయరాం గురుస్వామిజీ.. ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ స్వామిజీ, సంయుక్త కార్యదర్శిగా సకృ స్వామీజీలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు శంకర్ స్వామిజీ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నూతన సభ్యులను ఎన్నుకుంటామన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ సంప్రదాయాలకు చెందిన స్వామిజీలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post