మల్కాజిగిరి, వార్తానిధి: మల్కాజిగిరి డివిజనులో స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు.
జలమండలి జీఎం సునీల్‌తో ఆయన గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా డివిజనులోని బోర్ల రిపేరింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గురించి చర్చించారు. అందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు. వేసి కంటే ముందే పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Tags:
స్థానికం