బిజెపి భీమ్ దీక్షలో పాల్గొన్న శోభక్క

 


మల్యాల, వార్తానిధి: సీఎం కెసిఆర్ భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు ఖండించారు.

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మల్యాల మండల కేంద్రంలో భీమ్ దీక్షను గురువారం చేపట్టారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభక్క గాలన్న పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా శోభక్క మాట్లాడుతూ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కెసిఆర్ అనడం సరికాదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే ఆయన సీఎం అయ్యారని గుర్తు చేశారు. 

దీక్షలో మండల బిజెపి నాయకులు బొట్ల ప్రసాద్, బింగి వేణు, బొబ్బిలి వెంకటస్వామి, ఎంపీటీసీ రాచర్ల రమేష్, గుండేటి గంగారాం, నూకపల్లి ఉప సర్పంచ్ సురేష్ తదితరులున్నారు.

Post a Comment

Previous Post Next Post