రంగారెడ్డి, వార్తానిధి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం(తపస్) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్.. డైరీ ఆవిష్కరణ జరిగింది.
తపస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి నివాసంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డితో పాటు కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తపస్-2022 సంవత్సర క్యాలెండర్.. డైరీని వారు ఆవిష్కరించారు. అనంతరం జీఓ 317 సవరణపై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 12న నిర్వహించనున్న మహాధర్నా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
కార్యకర్తలు.. ఉపాధ్యాయుల సమీకరణకు చేపట్టవలసిన అంశాలపై సమాలోచనలు చేశారు. మహాధర్నాకు విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.