మేషం
ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మిథున
సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కర్కాటక
బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.
సింహ
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.
కన్య
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
తుల
ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.
ధనుస్సు
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.
మకర
సంతాన ఉద్యోగయత్నాలు సానుకూల మౌతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు.
కుంభ
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మీన
బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు.