అక్కన్నపేట కాంగ్రెస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

 

అక్కన్నపేట, వార్తానిధి: అక్కన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరెళ్ల లింగమూర్తి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జంగపెల్లి అయిలయ్య  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలకు అతి పెద్ద గ్రంథంలాంటిది అని అన్నారు. ప్రజలందరూ రాజ్యాంగ నియమాలను పాటిస్తూ భారత దేశాన్ని ఉన్నత స్థితిలో ఉండేలా చూడాలని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో చింతల బాలరాజు, కాషాబోయిన యాదగిరి, మిట్టపెల్లి బాలయ్య, బెజ్జంకి సారయ్య, పోతారుబోయిన రాజు, మేడబోయిన సాంబరాజ్, తాడూరి అయిలయ్య, జగిరి శ్రీనివాస్, కాషాబోయిన వెంకటరాజం, హున్మాండ్ల రాజిరెడ్డి, పిరెళ్ల రాజు, తంగాలపల్లి రవీందర్, యూత్  నాయకులు గూగుల్లోత్ రాజు, నకీర్తి మునిరాజ్, దేవునూరి రాజు, శేఖర్, రాజ్ కుమార్, సాయిరాజ్, రాహుల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post