నేటి రాశిఫలాలు(26-01-2022)

 

మేషం

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

 వృషభం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

 మిథునం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

 కర్కాటకం

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి.

 సింహం

నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

 కన్య

చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

 తుల

ఇంటా బయట సఖ్యత గా వ్యవహరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

 వృశ్చికం

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా చికాకులు అధికమవుతాయి.స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి. 

 ధనుస్సు

నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

 మకరం

రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. 

 కుంభం

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. 

 మీనం

దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు.

అర్చకులు రామదాసి రిపుంజయ్ శర్మ..


Post a Comment

Previous Post Next Post