గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ శ్రావణ్

 


మల్కాజిగిరి, వార్తానిధి: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజనులోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్, హనుమాన్ వ్యాయామశాల, ఎల్.బి.నగర్, ఆదర్శ నగర్, శ్రీకృష్ణ నగర్, ఆర్.కె.నగర్ ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు.


ముఖ్య  ఆహ్వానితులుగా హాజరైన స్థానిక కార్పొరేటర్ వురపల్లి శ్రావణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పౌరులందరికీ సమాన హక్కులను కల్పించిందని చెప్పారు. దేశంలో కుల, మత, వర్ణ, ప్రాంత భేదం లేకుండా ప్రజలందరూ సమానమేనని చెప్పారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగంలో ఉన్న అంశాలను తెలుసుకోవాలని కోరారు.

 #VurapallySravan #BJPcoporator #MalkajgiriCorporator

Post a Comment

Previous Post Next Post