ఆంధప్రదేశ్ : న్యామూర్తులతో పాటు న్యాయ స్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు. గతేడాది నవంబరులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తును ప్రారంభించారు.
గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరు చార్జీ షీటులను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మరో ఆరుగురు నిందితులైన అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిస, సుద్దులూరి అజయ్ అమృత్ లను అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
విదేశాల్లో ఉన్న నిందితులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై చట్టపరమై కార్యాచరణను సీబీఐ చేపట్టింది.