#Healthyfood స్వచ్ఛమైన ఆహారం తినటం వలన మనస్సు పవిత్రమవుతుంది

 


ఛాందోగ్య ఉపనిషత్తు (7.26.2)
ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః
భావం - స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది.

భగవద్గీత 17వ అధ్యాయం 7, 8, 9, 10వ శ్లోకాలు
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।।7।
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।।8।
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ।। 9 ।।
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ।। 10 ।।
భావం..
వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.
సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.
అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి.
ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.
వివరణ..
వండిన పదార్థము ఒక జాము (మూడు గంటలు) కంటే ఎక్కువగా నిలువ ఉంటే అది తామసిక ఆహారము అయిపోతుంది. అపరిశుద్దమైన ఆహారము, చెడురుచి లేదా చెడువాసన వచ్చే పదార్థములు ఇవే కోవకు వస్తాయి. అన్ని రకాల మాంసాహారము ఈ అపవిత్ర/అపరిశుద్ధ ఆహారము కోవకే వస్తాయి. ప్రకృతి ఈ మానవ దేహమును శాకాహారమునకే నిర్మాణం చేసింది. మానవులకు, మాంసాహార జంతువుల లాగా, మాంసం చీల్చటానికి కోరపళ్ళు (canine teeth) కానీ, వెడల్పైన దవడ కానీ ఉండవు. మాంసభక్షక జంతువులకు , త్వరగా కుళ్లిపోయే చనిపోయిన జంతుమాంసం, కొద్ది కాలమే కడుపు లోపల ఉండేవిధంగా, అది త్వరగా బయటకు వెళ్లిపోవటానికి పొట్టి (తక్కువ పొడుగు) పేగులు ఉంటాయి. దీనికి విరుద్ధంగా, శాఖాహార పదార్థములను నెమ్మదిగా మరియు చక్కగా జీర్ణం చేసుకోవటానికి, మనుష్యులకు పొడవాటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. మాంసాహార జీవుల కడుపులో ఆమ్ల తీవ్రత మనుష్యులలో కంటే ఎక్కువగా ఉంటుంది, అది వాటికి పచ్చి మాంసం జీర్ణం చేసుకోవటానికి దోహదపడుతుంది. ఆసక్తికరంగా, మాంసాహార జంతువులు చర్మరంధ్రాల నుండి చెమట కార్చవు. అవి శరీర తాపమును నాలుక ద్వారా నియంత్రిస్తాయి. అదే సమయంలో, శాఖాహారులు మరియు మనుష్యులు తమ శరీర తాపమును చర్మరంధ్రాల ద్వారా వచ్చే చెమట (స్వేదము) ద్వారా నియంత్రిస్తాయి. త్రాగేటపుడు మాంసాహార జీవులు నీటిని గతుకుతాయి (నేరుగా పీల్చవు). కానీ, శాఖాహార జంతువులు నీటిని గతకవు, పీల్చుతాయి. మనుష్యులు కూడా నీరు త్రాగేటప్పుడు నీటిని పీల్చుతారు. ఇవన్నీ మానవ శరీరము యొక్క భౌతిక లక్షణములు, భగవంతుడు మనుష్యులను మాంసభక్షక జంతువులలా తయారుచేయలేదని మనకు తెలియచేస్తున్నాయి, అందుకే మాంసము మనుష్యులకు అశుచి/అపవిత్ర మైనదిగా పరిగణించబడుతుంది.
మాంస భక్షణ పాడు ఖర్మను కూడా కలుగచేస్తుంది. మను స్మృతి ప్రకారం:
మాంస భక్షయితా ముత్ర యస్య మాంసం ఇహాద్మ్యహం
ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదన్తి మనీషిణః (5-55)
‘మాంసము అంటే అర్థం "నేను దేనినైతే ఇక్కడ తింటున్నానో, నన్ను అది వచ్చే జన్మలో తింటుంది." అని. ఈ కారణం చేతనే మాంసమునకు ఆపేరు వచ్చింది అని అంటారు. (మళ్ళీ జరిగే పని: నేను దాన్ని తింటాను, అది నన్ను తింటుంది).’

Post a Comment

Previous Post Next Post