న్యూదిల్లీ, వార్తానిధి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీసులను ఇచ్చారు. వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ పైన అమిత్ షా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని స్పీకరుకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే కేంద్ర హోం శాఖ మంత్రి చెప్పినట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే దుర్ఘటనలో బాధితుల సంఖ్య తగ్గేదని చెప్పారు. అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ బాధితులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
#homeminister #amithshah #newdelhi #congress #varthanidhi
Source: ANI
Tags:
జాతీయ వార్తలు