గోవాలో పురాతన ఏకశిల మహాదేవాలయం

గోవా అనగానే సముద్ర తీరం. చుట్టూ అడవులు.. ఆహ్లాదకరమైన వాతావరణం వెంటనే గుర్తొస్తాయి. అన్నింటికంటే ముందు బీచ్ అనే మాట కుర్రకారు మనసులో ఉరకలేస్తూ ఉంటుంది. కానీ గోవాలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎంతో ప్రత్యేక ఏకశిలతో నిర్మించినట్లుగా చెప్పబడే మహాదేవాలయం కూడా ఒకటి. దీన్నే మహాదేవ్ టెంపుల్ అని పిలుస్తుంటారు. గోవాలోని తంబడి సుర్లా ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు.

కదంబ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల చరిత్రలో జరిగిన ఇస్లామిక్, గోవా మతమార్పిడుల ప్రభావం నుంచి కొంత మేర బయటపడింది. తూర్పు కనుమల్లో కొలువైన ఈ మహాదేవుడి ఆలయంలో శివుడు ప్రధాన దైవం. ఇందులో గర్భాలయం, అంతరాలయం, నంది మండపం ఉంటాయి. అయితే ఇక్కడకు చేరుకోవాలంటే మాత్రం వ్యవప్రయాసలు కూర్చాల్సిందే. ఎందుకంటే పూర్తిగా అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది. 

#Goa #ancienttemples #tourism #mahadevtemple #varthanidhi

లొకేషన్ లింక్ : Kadamba Shri Mahadeva Temple

Post a Comment

Previous Post Next Post