న్యూదిల్లీ, వార్తానిధి: వాయనాడ్ లోని ల్యాండ్ స్లైడ్స్ గురించి కేరళ ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించినా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లోక్ సభలో ఆయన మాట్లాడుతూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడమే కాకుండా 24న గుర్తు చేశామన్నారు, 25న మరోసారి గుర్తు చేశామన్నారు. చివరకు జూలై 26న హెచ్చరించినప్పటికీ కేరళ ప్రభుత్వం తమ మాటను పెడచెవిన పెట్టిందన్నారు. ఈ విషయమాన్ని తాను బహిర్గతం చేయొద్దని అనుకున్నప్పటికీ, కేరళలో జరిగిన విపత్తుకు కేంద్రాన్ని విమర్శిస్తున్న వారికి సమాధానం చెప్పక తప్పని పరిస్థితుల్లో బహిర్గతం చేశామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సూచనలను పెడచెవిన పెట్టడం మానుకోవాలని, రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని సూచించారు.
#kerala #landslide #loksabha #amithshah #delhi