హైదరాబాద్, వార్తానిధి: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం బహుళ భూగర్భ సొరంగాలను ప్రతిపాదించింది. వీటిలో కెబిఆర్ నేషనల్ పార్క్ కింద వెళ్లే సొరంగం కూడా ఉంది. అయితే దీని పట్ల పర్యావరణవేత్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సొరంగాలు తవ్వడం వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ప్రతిపాదిత మార్గాలు:
- ITC కోహెనూర్ నుండి విప్రో జంక్షన్ (ఖాజాగూడ, నానక్రామ్‌గూడ మీదుగా)
- ITC కోహెనూర్ నుండి JNTU జంక్షన్ (మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా)
- ఐటీసీ కోహెనూర్ నుండి బంజారాహిల్స్ రోడ్ నెం.10 (జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 మీదుగా)
- జివికె 1 మాల్ నుండి నానల్‌నగర్ (మాసాబ్ ట్యాంక్ ద్వారా)
- బంజారాహిల్స్ రోడ్ నెం. 3, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మధ్య ప్రతిపాదించిన సొరంగం రూ.3,000 కోట్లుగా అంచనా వేశారు.