అగస్టు 21న తపస్ ఆధ్వర్యంలో మహా ధర్నా

 




-ఛలో ఇందిరా పార్క్ పిలుపునిచ్చిన నేతలు
-పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని
-ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్
-బదిలీలు, పదోన్నతుల కోసం నిరసన

రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మహాధర్నాను చేపట్టనుంది. అగస్టు 21న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ విషయమై తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ మాట్లాడారు.

పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను వెంటనే నియమించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జీఓ 317  కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. ఎంతో కాలం నుంచి బదిలీలు, పదోన్నతుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయుల పక్షాన నిలిచి నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు.

అదే విధంగా కేజీబీవీ ఒప్పంద ఉపాధ్యాయుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. కేజీబీవీ హాస్టళ్లలో వార్డెన్లను నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధానం అమలు చేయాలని చెప్పారు. మోడల్ స్కూల్స్, గురుకులాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

డిమాండ్ల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 

Post a Comment

Previous Post Next Post