భగవంతుడు సర్వవ్యాపి..భగవంతుడు సత్య రూపుడు..సత్యమే భగవంతుడు.
అందరిలో.. అన్నింటిలో ఆయన ఉన్నప్పుడు ఒకటి తక్కువా ఒకటి ఎక్కువ అని ఎలా చెప్పగలం? అలానే పుట్టుక వలన వచ్చే జాతి ( కులం ) ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎలా చెప్తాము?? సంత్ రవిదాస్ గారిని ఆయన కుటుంబ సభ్యులే వెనక్కి లాగారు కానీ ఆయన సత్య మార్గాన్నే ఎంచుకున్నారు. సత్యాన్ని గురించి శోధించారు.
ఆయనకు ఈశ్వర దర్శనం అయింది. అప్పుడు ఆయన చెప్పారు ' సత్యమే శివం ' అని. పుట్టుక కారణంగా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఇది శాస్త్ర ప్రమాణం అని ఎవరైతే మాట్లాడుతున్నారో వారు సత్యాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోవచ్చు. లేదా సత్యాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండవచ్చు. లేదా వాళ్ళు సత్యాన్ని అర్ధం చేసుకోవడంలో తికమక పడి ఉండవచ్చు. మన ధర్మం ఎప్పుడూ సమాజ అసమానతలు బోధించలేదు.
ఈ విషయాన్ని సమాజానికి తెలియచెప్పాలి. మన ధర్మం మనకి ముఖ్యంగా మూడు విషయాలు ఎలా ఆచరణాత్మకంగా ఉండాలో బోధించింది. 1. సత్యము 2. ధర్మాచరణ/పాలన 3. కర్తవ్యం. సంత్ రవిదాస్ స్మారకోపన్యాసంలో పరమపూజ్య సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్. వారి ప్రసంగాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చి రాసాయి భారత వ్యతిరేకశక్తులు. వారి ప్రసంగంలో ఎక్కడ కులప్రసక్తే చేయలేదు.
#MohanBagwath #RSS #SanghParivar #Telangana