సూర్యాపేట జిల్లా, వార్తానిధి: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవి గూడెం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు అమరగాని నర్సయ్య గౌడ్ తాటి చెట్టుపై నుంచి పడి మరణించారు.
రోజులాగానే బుధవారం తాటి చెట్టు ఎక్కగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయమై తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోహెడ కొమరయ్య గౌడ్ స్పందించారు.
నర్సయ్య గౌడ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
అబ్కారీ శాఖతో పాటు కల్లు గీత ఆర్థిక కార్పొరేషన్ ద్వారా దహన సంస్కారాలకు రూ.25వేలు ఇవ్వాలన్నారు. అదే విధంగా బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని విన్నవించారు.
#Toddyworker #Accidental death
Tags:
స్థానికం